బ్రిటన్ కూడా ట్రంప్ బాటలోనే అక్రమవలసదారులు 600 మందిని అరెస్టు చేసింది. దీనిపై తాజాగా దేశ ప్రధాని కీర్స్టార్మర్ స్పందించారు. అక్రమ వలసలకు ముగింపు పలుకుతామన్నారు. గత ఏడాది జులైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు వందల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేశారు. వీరంతా చట్టవ్యతిరేకంగా యుకె లోకి అడుగుపెట్టి , బార్లు , రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి 609 మందిని అరెస్టు చేశారు. గత ఏడాది జులై నుంచి ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్టు యూకె హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)