అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖులతో వరుసగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ బేటిలో మస్క్ తోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రధాని మోదీ బస చేసిన బ్లెయిర్ హౌస్లో ఇరువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎలాన్ మస్క్ భారత్లో టెస్లా ఎంట్రీ, స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలపై చర్చించినట్లు సమాచారం.మోదీతోపాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి మస్క్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
