Skip to main content

Namaste NRI

లండన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం శుభసందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం కుటుంబసమేతంగా పాల్గొని లండన్ లో మొక్కలు నాటారు. కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు అనిల్ తెలిపారు. అందరూ వృక్షార్చనలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు. పచ్చదనం కోసం మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ చేస్తున్న కృషి చాలా గొప్పదని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని అనిల్ పిలుపునిచ్చారు. రాబోయే తరాలు సంతోష్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుందని అనిల్ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News