Skip to main content

Namaste NRI

భారత్ కు అమెరికా భారీ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. భారత్ లో వోటరు శాతం పెంపుదలకు ఇప్పటి వరకు అందజేస్తున్న 21 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 182 కోట్లు) సాయాన్ని నిలిపివేశారు. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని ప్రభుత్వ సామర్థ విభాగం (డిఒజిఇ డోజ్) తాజాగా ఈ ప్రకటన చేసింది. ట్రంప్ క్రితం నెల డోజ్ కు సారథిగా మస్క్ ను ఎంపిక చేశారు. పాలన మెరుగుదల, వృథా ఖర్చుల కట్టడి బాధ్యత చేపట్టిన డోజ్ ఈ కోతలు ప్రకటించింది. అదే విధంగా బంగ్లాదేశ్ ను రాజకీయంగా బలోపేతం చేసే లక్షంతో అమెరికా కేటాయిస్తున్న 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 251 కోట్లు) సాయాన్ని కూడా డోజ్ నిలిపివేసింది. అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతల్లో భాగంగానే డోజ్ ఈ నిర్ణయం తీసుకున్నది. భారత్, బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో అమెరికా ఇప్పటి వరకు ఈ గ్రాంట్ అందజేస్తోంది.డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమైన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events