Skip to main content

Namaste NRI

ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం తో: సందీప్ కిషన్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మజాకా. రీతూవర్మ కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్, హాస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇన్నోవేటివ్ పంథా ను ఎంచుకొని ఈ సినిమా పాట షూటింగ్ ను లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో సందీప్ కిషన్ మాట్లాడుతూ తొలిసారి ఇలా లైవ్ షూటింగ్ ని చూపించడం ఆనందంగా ఉంది. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇది. ఈ సినిమా విజయం పై పూర్తి నమ్మకం తో ఉన్నాం అన్నారు.
ప్రస్తుతం రావులమ్మ అనే రెండో పాట చిత్రీకరణ జరుపుతున్నామని, దాదాపు డబ్బు మంది డ్యాన్సర్స్ తో శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం లో పాట అద్భుతంగా వస్తున్నదని, ఇదొక జానపద గీతమని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెలిపారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్నందిస్తున్నారు. శివరాత్రి కానుక గా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events