ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం శివంగి. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై నరేష్ బాబు పి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఇందులో ఆనంది స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ పోరాటం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. మార్చి 7న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏ.హెచ్.కాషిప్, ఎబినేజర్ పాల్, దర్శకత్వం: దేవరాజ్ భరణి ధరన్.
