నటీనటుల ముఖాలు కనిపించకుండా కేవలం కథ, కథనాల మీద సినిమాను నడిపిస్తూ ఓ వైవిధ్యమైన ప్రయోగంతో తెరకెక్కిస్తున్న చిత్రం రా రాజా. బి.శివప్రసాద్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్ సంస్థ నిర్మించింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను వీక్షించి, రిలీజ్ డేట్ పోస్టర్ను రిలీజ్ చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇదొక అద్భుతమైన ఐడియా అని కొనియాడారు. ఆర్టిస్టుల ముఖాలు కనిపించకుండా, కేవలం కథ, కథనాలపై దృష్టి పెట్టి ఈ సినిమా తీశామని, తెలుగు ప్రేక్షకులు ఈ ప్రయోగాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు పేర్కొన్నారు. మార్చి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: శేఖర్చంద్ర, దర్శకుడు: బి.శివప్రసాద్.
