సందీప్ కిషన్ , రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం. ఈ చిత్రాన్ని రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. జానపద శైలిలో సాగిన ఈ గీతానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. రేవంత్ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. విజువల్స్ తో పాటు మోయిన్ మాస్టర్ అందించిన నృత్యరీతులు పాటలో హైలైట్ గా నిలిచాయి. ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిదని, ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే అన్ని అంశాలుంటాయని మేకర్స్ తెలిపారు. రావు రమేష్, అన్షు తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 26న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.
