
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్) ద్వారా ప్రపంచ దేశాలకు అందుతున్న సాయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే నిలిపివేసిన విషయం తెలిసిందే. మన దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ సంస్థ ద్వారా భారత్‌కు అందుతున్న రూ.182 కోట్ల (21 మిలియన్ డాలర్లు) సాయాన్ని కూడా నిలిపివేశారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు వేశారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం కొంతమందిని మినహాయించి మిగిలినవారికి బలవంతపు సెలవులు ప్రకటించారు. ఈ విషయం యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ వెబ్‌సైట్‌లోని నోటీసు ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్ జడ్జి అనుమతించిన తర్వాత యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు విషయంలో ట్రంప్ యంత్రాంగం ముందుకెళ్లినట్లు తెలిసింది. తమ తొలగింపు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఞప్తిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి కార్ల్ నికోలస్ తిరస్కరించారు
