
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. కెనడా అమెరికాలో 51 వ రాష్ట్రంగా ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు బెదిరిస్తున్నారు. అమెరికా దాని ప్రధాన మిత్ర దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ కూటమి ఫైవ్‌ఐస్ నుంచి కెనడాను బయటకు పంపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 1946లో విశ్వసనీయ సమాచార మార్పిడి కోసం అమెరికా, యూకె కలిసి యుకెయుఎస్‌ఎ ఒప్పందం చేసుకోగా, 1956లో ఈ కూటమి విస్తరించి కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా చేరాయి.దీంతో అది ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్‌గా రూపాంతరం చెందింది.
