
తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్న వినోదాత్మక చిత్రం అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గాలి కృష్ణ నిర్మిస్తున్నారు. 1980లో వరంగల్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశాం. ఆద్యంతం చక్కటి హాస్యంతో అలరిస్తుంది. తెలంగాణ నేటివిటీతో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీరామకృష్ణ సినిమా, రచన-దర్శకత్వం: రాజా దుస్సా.
