
మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్‌కుమార్ శివుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ముంబయిలో టీజర్‌ను అక్షయ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడారు. కన్నప్ప చిత్రంలో తొలుత ఆఫర్ వచ్చినప్పుడు వద్దనుకున్నా. కానీ శివుడి పాత్రలో నేను బాగుంటానని విష్ణు బాగా నమ్మాడు. ఆయన నమ్మకమే నన్ను సినిమా చేసేలా ముందుకు నడిపించింది. ఈ కథ బలమైన భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలతో విజువల్ వండర్‌గా ఉండబోతున్నది అన్నారు.

కన్నప్ప తన దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదని, ఇదొక జీవిత ప్రయాణమని, దీనితో తనకు ఓ అధ్యాత్మిక బంధం ఏర్పడిందని మంచు విష్ణు తెలిపారు. అబ్బురపరిచే విజువల్స్‌తో దైవిక శక్తి కలబోసిన ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కన్నప్ప చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదలకానుంది.
