Namaste NRI

ఆ విషయంలో మేం సక్సెస్‌ అయ్యాం :  త్రినాథరావు

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మజాకా.  రీతూవర్మ కథానాయిక. రావురమేష్‌, అన్షూ కీలక పాత్రధారులు.నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేష్‌ దండా నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా  హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌మీట్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడారు.  నేను ఎంజాయ్‌ చేసి చేసిన సినిమా ఇది. ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. థియేటర్‌లో అందరితో కలిసి చూశాను. మా లక్ష్యం నెరవేరిందని అర్థమైంది. చివర్లో ఎమోషన్‌కి కూడా బాగా కనెక్టయ్యారు. ఆడియన్స్‌ నుంచి వస్తున్న స్పందన చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నది  అని అన్నారు.

నవ్వొచ్చినప్పుడు నవ్వాలి. ఏడుపొచ్చినప్పుడు ఏడవాలి. అప్పుడే హెల్త్‌ బావుంటుంది. ఈ రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. ఆ విషయంలో మేం సక్సెస్‌ అయ్యాం. తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ ఇది  అని దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పారు. తాను రాసిన ప్రతి పదానికీ గౌరవం తెచ్చేంత గొప్పగా త్రినాథరావు నక్కిన ఈ సినిమా తీశారని రైటర్‌ ప్రసన్న అన్నారు. ఈ సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయని నిర్మాత రాజేష్‌ దండా తెలిపారు. ఇంకా కథానాయికలు రీతూవర్మ, అన్షు, నిర్మాత అనిల్‌ సుంకరలతోపాటు అతిథులుగా విచ్చేసిన దర్శకులు రామ్‌ అబ్బరాజు, ఐవి ఆనంద్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events