Skip to main content

Namaste NRI

ఆర్టిస్ట్  మూవీ ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్

సంతోష్‌ కల్వచెర్ల, క్రిషేక పటేల్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ఆర్టిస్ట్‌. కథానాయిక క్రిషేక పటేల్‌  రతన్‌ రిషి దర్శకుడు. జేమ్స్‌ వాట్‌ కొమ్ము నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు రతన్‌ రిషి మాట్లాడుతూ ఇదొక సైకో థ్రిలర్‌. సస్పెన్స్‌, భయం కామెడీ, రొమాన్స్‌ ఇందులో మెండుగా ఉంటాయి. ఓ ఉద్వేగపూరితమైన కథ ఇది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఆడియన్‌కి అద్భుతమైన ఫీల్‌ని కలిగిస్తుంది. సాంకేతికంగా కూడా ఆకట్టుకుంటుంది అని తెలిపారు. సమాజంలోని ఓ సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని, కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, పేషన్‌ ఉన్న నిర్మాత దొరకడం తమ అదృష్టమని హీరో సంతోష్‌ అన్నారు. మంచి కంటెంట్‌తో ఈ సినిమా నిర్మించామని నిర్మాత జేమ్స్‌ వాట్‌ కొమ్ము చెప్పారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి తదితరులు మాట్లాడారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News