Skip to main content

Namaste NRI

అమెరికాకు కెనడా హెచ్చరిక

మిత్రులు, శత్రువులు అని తేడా లేకుండా పొరుగు దేశమైన కెనడా పైనా 25 శాతం టారిఫ్ విధించడంతో ఆ దేశం కూడా ప్రతీకార చర్యకు పూనుకుంది. ఎలాన్ మస్క్ నేతృత్వం లోని స్టార్‌లింక్‌తో ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. స్టార్‌లింక్ డీల్ కింద తొలుత 15 వేల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు ఇంటర్నెట్ సదుపాయం అందించాల్సి ఉంది. తాము ఆర్థికంగా దెబ్బతింటుంటే చూస్తూ కూర్చూబోమని డగ్ ఫోర్డ్ తేల్చి చెప్పారు.  కరెంట్ కోతలు విధిస్తాను. ఒంటారియాతో స్టార్‌లింక్‌కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను.

అది పూర్తయింది. కెనడా ప్రజలను ట్రంప్ తక్కువ అంచనా వేస్తున్నారు. మా స్టోర్ల నుంచి యూఎస్ ఆల్కహాల్‌ను తొలగించాలని యోచిస్తున్నాం  అని ఫోర్డ్ వెల్లడించారు. అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వెళ్తున్నాయి. కెనడాకు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోపవర్ , సహజవాయువు, ఎలక్ట్రిసిటీపై యూఎస్ ఆధారపడింది. సన్నిహిత మిత్రులు, పొరుగువారిపై ఎందుకు దాడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కెనడా పై సుంకం అంటే అమెరికన్లపై పన్ను విధించడం కిందకే వస్తుంది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events