Skip to main content

Namaste NRI

ఇదే మీకు చివరి హెచ్చరిక‌..లేకుంటే అంతుచూస్తా

బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హమాస్‌ గ్రూప్‌కు మరోసారి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే హమాస్‌ అంతు చేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు.  మీ చెరలో ఉన్న బందీలందరినీ వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేదంటే మీ అంతు చూస్తా. అందుకు ఇజ్రాయెల్‌కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతాను. నేను చెప్పింది చేయకుంటే,  ఒక్క హమాస్‌ సభ్యుడు కూడా మిగలడు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని నేను కలిశాను. ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోంది. మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌కు ట్రంప్‌ ఇలా సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో కూడా తీవ్రంగా హెచ్చరించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events