
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కాల్పుల విమరణ కు అంగీకరించినట్లు తెలుస్తోంది. అమెరికా చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. తక్షణమే 30 రోజుల పాటు కాల్పుల విమరణ పాటించాలని అమెరికా తన ప్రతిపాదనలో పేర్కొన్నది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో అమెరికా ప్రతినిధులతో ఉక్రెయిన్ బృందం జరిపిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల సీనియర్ అధికారుల భేటీ తర్వాత ప్రకటన రిలీజ్ చేశారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యాకు చేరవేస్తామని అమెరికా తెలిపింది. అయితే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇంటెలిజెన్స్ షేరింగ్, సెక్యూర్టీ సహకారం ఇవ్వనున్నట్లు తెలిపింది. శాంతి దిశగా అడుగులు వేసేందుకు రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు మళ్లీ చర్చలు చేపట్టనున్నారు. చర్చల ప్రక్రియలో రష్యా ప్రమేయాన్ని అమెరికా ఆశిస్తున్నది. అలాగే ఆ ప్రక్రియలో యురోపియన్ దేశాలు ఉండాలని ఉక్రెయిన్ కోరుతున్నది.
