Skip to main content

Namaste NRI

అర్జున్ సన్నాఫ్ వైజయంతి టీజర్ రిలీజ్ అప్పుడే

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న యాక్షన్‌ ప్యాక్డ్‌ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి. విజయశాంతి ఇందులో పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకుడు. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ప్రీ టీజర్‌ని ఈ నెల 14న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఫ్రెంచ్‌ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్‌ ల్యాండ్‌ స్కేప్‌లో డైనమిక్‌గా నడుస్తూ మోడరన్‌ అవతార్‌లో ఉన్న కల్యాణ్‌రామ్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ప్రీ టీజర్‌లోనే అఫీషియల్‌ టీజర్‌ విడుదల తేదీని కూడా రివీల్‌ చేయనున్నామని మేకర్స్‌ తెలిపారు. సోహైల్‌ ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌, యానిమల్‌ పృథ్వీరాజ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా, కెమెరా: రామ్‌ప్రసాద్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News