Namaste NRI

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో దీక్ష త్వరలో విడుదల

ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం దీక్ష. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కిరణ్‌, అలేఖ్య రెడ్డి జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనే పాయింట్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథలోని మైథలాజికల్‌ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కథానుగుణంగా అద్భుతమైన సంగీతం కుదిరింది. ఐదు పాటలు ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఆక్సఖాన్‌, తులసి, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Social Share Spread Message

Latest News