Skip to main content

Namaste NRI

పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ మూవీ 28 డిగ్రీ సెల్సియస్‌ నుంచి చెలియా చెలియా సాంగ్ రిలీజ్

నవీన్‌చంద్ర, షాలినీ వడ్ని కట్టి జంటగా నటిస్తున్న చిత్రం 28 డిగ్రీ సెల్సియస్‌. డా॥ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం.  ఈ చిత్రాన్ని అభిషేక్‌ నిర్మించారు. ఈ సినిమా నుంచి చెలియా చెలియా అనే పాటను విడుదల చేశారు. శ్రావణ్‌ భరద్వాజ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్నందించారు. నీ నగుమోము కనులారా చూస్తుంటే క్షణమైనా కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా వెంటాడే మౌనంగా, నిన్ను చూడంగ, కనులు చాలవుగా, నా జతగా రా, చెలియా చెలియా అంటూ చక్కటి లవ్‌ఫీల్‌తో ఈ పాట సాగింది. హృదయాన్ని స్పృశించే ప్రేమకథా చిత్రమిదని, ఇందులో టెంపరేచర్‌ అనే కాన్సెప్ట్‌ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. జయప్రకాష్‌, ప్రియదర్శి, హర్ష చెముడు తదితరులు నటించారు.  ఈ నెల 28న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్‌, దర్శకత్వం: డా॥ అనిల్‌ విశ్వనాథ్‌.

Social Share Spread Message

Latest News