Skip to main content

Namaste NRI

సీఎం పెళ్లాం సినిమా ప్రమోషనల్ సాంగ్  లాంచ్

ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం సీఎం పెళ్లాం. గడ్డం రమణారెడ్డి దర్శకుడు. బొల్లా రామకృష్ణ నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో హైదరాబాద్‌లో  ఘనంగా జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ఒకే ఒక్కడు సినిమాలో వన్‌డే సీఎంని చూశాం. ఈ సినిమాలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. సామాజిక స్పృహతో కూడిన కథాంశమిది. వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది అని తెలిపారు.

నవ్వించడంతోపాటు ఆలోచింపజేసే సినిమా ఇదని, రియల్‌ లైఫ్‌లో  జరుగుతున్న సంఘటనలు ఈ సినిమాలో చూస్తారని, ఈ కంటెంట్ ఓరియెంట్ మూవీ అందరికీ నచ్చుతుందని ఇంద్రజ నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమాలో నటించడం పట్ల నటుడు అజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. నగేష్, కోటేశ్వరరావు, భరత్, ప్రీతినిగం, రూపలక్ష్మీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నాగశ్రీనివాసరెడ్డి, సంగీతం: ప్రిన్స్ హెన్రీ.

Social Share Spread Message

Latest News