Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తనపై ప్రతికూల వార్తలు రాసే మరిన్ని వార్తా సంస్థలపైనా భవిష్యత్తులో వేటు తప్పదని పేర్కొన్నారు.

మరోవైపు గ్రీన్‌లాండ్‌కు సంబంధించి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. గ్రీన్‌లాండ్‌ భద్రతపై డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌లతో శాశ్వత ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్‌లాండ్ భద్రత, ఇతర అవసరాలపై అమెరికాకు శాశ్వత నియంత్రణ ఉండనుంది. తమ అనుమతి లేకుండా ఏ దేశాల స్థావరాలు ఇక్కడ ఏర్పాటు ఉండబోదని తెలిపారు. త్వరలోనే గ్రీన్‌లాండ్‌లో భారీ సైనిక స్థావరం ఏర్పాటు చేస్తామని ట్రంప్‌ వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events