Skip to main content

Namaste NRI

సౌదీ అరేబియాకు మరో షాక్‌ .. అమెరికా రహస్య ఒప్పందం?

యెమెన్‌లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ, సౌదీ అరేబియాకు మరో షాక్‌ తగిలింది. ఒమన్‌ రాజధాని మస్కట్‌లో ఇరాన్‌ మద్దతున్న హౌతీలతో అమెరికా రహస్యంగా చర్చలు జరపడం సంచలనంగా మారింది. ఇప్పటికే హౌతీ లు వ్యూహాత్మక బాబ్‌ ఎల్‌-మాబ్‌ జలసంధిలో పట్టు పెంచుకున్నారు. సౌదీ చమురు ఎగుమతులతో పాటు ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గం కీలకం.ఇలాంటి సమయంతో సౌదీ మిత్ర దేశమైన యూఎస్‌ హౌతీలతో చర్చలు జరుపుతున్నట్టు జేడీ వాన్స్‌ తెలిపారు.

మస్కట్‌లో రహస్యంగా ఒప్పందం జరిగినట్టు తెలిసింది. ఈ చర్చల్లో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల కాల్పుల విరమణ, యూఎస్‌, ఇజ్రాయెల్‌ నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు హామీ ఇవ్వడంతో పాటు సౌదీపై దాడులు కొనసాగించడం లాంటివి ఉన్నాయని తెలిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events