Namaste NRI

ఇండో-కొరియన్ హారర్ కామెడీతో వస్తున్న వరుణ్ తేజ్

వరుణ్‌తేజ్‌ కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్‌ హారర్‌ కామెడీ మూవీగా తెరకెక్కించనున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైమెంట్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. సోమవారం నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం. ఈ హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌లో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. వరుణ్‌తేజ్‌ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం  అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ.

Social Share Spread Message

Latest News