Skip to main content

Namaste NRI

భారతీయులకు అమెరికా షాక్‌.. భారీగా వీసా అపాయింట్‌మెంట్లను

భారత్‌ లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయులకు షాకిచ్చింది. తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసింది. అపాయింట్‌మెంట్‌ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ కారణంగా ఏకంగా 2 వేల యూఎస్‌ వీసీ దరఖాస్తులను రద్దు చేసినట్లు ప్రకటించింది. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండటంతో వీటిని రద్దు చేసినట్లు తెలిపింది. ఈ అపాయింట్‌మెంట్లు అన్నీ బాట్స్ ద్వారా వచ్చినట్లు గుర్తించినట్లు పేర్కొంది.

బాట్స్ చేసిన 2 వేల వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని కాన్సులర్ టీం రద్దు చేస్తోంది. మా షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్‌లను ఏమాత్రం సహించేది లేదు. ఈ అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతో పాటు,  ఆయా సంబంధిత ఖాతాలకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నాం అని దౌత్య కార్యాలయం పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events