Skip to main content

Namaste NRI

ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుంది : సీఎం రేవంత్ రెడ్డి

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో సన్నబియ్యం పథకానికి తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్రారంభించారు. .  తొలుత సీఎం, మంత్రి ఉత్తమ్‌తోపాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని అన్నారు. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం తీసుకొచ్చామన్నారు. ప్రతి రోజూ పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపాయి 90 పైసలకే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రారంభించిన పథకాన్ని దివంగత నందమూరి తారక రామారావు కూడా కొనసాగించారని గుర్తు చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని అన్న ఎన్టీఆర్‌ తీసుకొచ్చారని తెలిపారు.

పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజా పంపిణీ విధానం ఉందన్నారు. ఏడు దశాబ్దాల క్రితమే పీడీఎస్‌ను కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని చెప్పారు. దొడ్డు బియ్యాన్ని ఇస్తే చాలా మంది తినడం లేదని, మిల్లర్ల మాఫియాలోకి వెళ్తోందని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. దొడ్డు బియ్యంతో ప్రతి సంవత్సరం రూ. 10 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదవాడు ప్రతి రోజూ సన్నబియ్యం తినాలనేదే తమ ఆలోచన అని చెప్పారు. సన్న బియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. పేదల కోసం సోనియా గాంధీ ఆహారభద్రతా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో పేదల ఆకలిని తీర్చిన తల్లి సోనియమ్మ అని తెలిపారు. సన్న బియ్యం ఆలోచన గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events