Skip to main content

Namaste NRI

శ్రీరామ నవమి శుభ సందర్భంగా అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి న్యూ పోస్టర్ రిలీజ్

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి. విజయశాంతి ఇందులో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకుడు. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా కొత్త పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. కల్యాణ్‌రామ్‌, విజయశాంతి డైనమిక్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇదని, త్వరలో గ్రాండ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నామని, ఆ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ని లాంచ్‌ చేస్తామని మేకర్స్‌ తెలిపారు. సాయి మంజ్రేకర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సోహైల్‌ఖాన్‌, యానిమల్‌ పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి కథనం: శ్రీకాంత్‌ విస్సా, కెమెరా: రామ్‌ ప్రసాద్‌, సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌, సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, నిర్మాణం: అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News