Skip to main content

Namaste NRI

శుభం విడుదల ఖరారు

ప్రముఖ నటి సమంత నిర్మాతగా తీసిన చిత్రం శుభం. ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్‌ ఇందులో ప్రధాన పాత్రధారులు. మే 9న విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలియజేశారు. సెన్సిబుల్‌ హ్యూమర్‌తో ఈ సినిమా అందర్నీ పాత కాలానికి తీసుకెళ్తుందని, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. సమంత మాట్లాడుతూ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా మా ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ ముందుకెళ్తుంది. ఆ కోవలో మేం చేసిన తొలి ప్రయత్నమే శుభం అన్నారు.

Social Share Spread Message

Latest News