Namaste NRI

ఈ కథను ఆ శివుడే నాతో రాయించాడు :  సంపత్‌నంది

సంపత్‌నంది  దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ఓదెల 2. ఓటీటీ హిట్‌ ఓదెల రైల్వే స్టేషన్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. తమన్నా ప్రధాన పాత్ర పోషించారు. అశోక్‌ తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. ఈ నెల 17న సినిమా విడుద లైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సంపత్‌నంది మాట్లాడారు.  ఈ సినిమా విషయంలో మేం ఏమీ ప్లాన్‌ చేసుకోలేదు. అన్నీ వాటంతటవే జరిగిపోయాయి. ఈ కథను ఆ శివుడే నాతో రాయించాడు. ప్రతి టెక్నీషియన్‌ ప్రాణంపెట్టి పనిచేశాడు. 20ఏళ్ల తమన్నా కెరీర్‌ ఒకపైపు, ఓదెల 2 ఒకపైపు అని అందరూ అంటున్నారు. వశిష్ట ఎన్‌.సింహాకు ఈ సినిమా పెద్ద బ్రేక్‌. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌ అని అన్నారు.  తాము రివ్యూయర్స్‌ కోసం సినిమా చేయలేదని, ప్రేక్షకుల కోసమే సినిమా తీశామని, సినిమా బాగుంది కాబట్టే కలెక్షన్స్‌ పెరుగుతున్నాయని దర్శకనిర్మాతలు అశోక్‌తేజ, మధు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News