Namaste NRI

హీరో నాని లాంచ్ చేసిన.. కింగ్‌ జాకీ క్వీన్‌ టీజర్‌  

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కింగ్‌ జాకీ క్వీన్‌. కేకే దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఇందులో దీక్షిత్‌శెట్టి రాజు పాత్రలో, యుక్తి తరేజా రాణి పాత్రలో కనిపించారు. నగరం, తుపాకీ రెండు ఒకటే, అవి వాటిని పట్టుకున్న వ్యక్తి మాట వింటాయి అంటూ రాజు చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా ప్రారంభమైంది. కత్తితో జీవించేవాడు కత్తితో చనిపోతాడు అనే బైబిల్‌ నోట్‌తో టీజర్‌ను ముగించిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దీక్షిత్‌ శెట్టి తెలిపారు. 1990ల నేపథ్యంలో నడిచే పీరియాడిక్‌ క్రైమ్‌ డ్రామా ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేష్‌ బానెల్‌, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, దర్శకత్వం: కేకే.

Social Share Spread Message

Latest News