
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న డార్క్ కామెడీ థ్రిల్లర్ గుర్రం పాపిరెడ్డి. మురళీ మనోహర్ దర్శకుడు. వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మాతలు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. పర్‌ఫెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఇదని ఈ పోస్టర్ చెబుతున్నది. బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్‌కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: డా.సంధ్య గోలి.
