Namaste NRI

భారత్‌కు మా సంపూర్ణ మద్దతు : అమెరికా

ఉగ్రవాదానికి   వ్యతిరేకంగా భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అమెరికా నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.

విలేకరుల సమావేశంలో టామీ బ్రూస్‌ మాట్లాడుతూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో జరిపిన సంభాషణను ప్రస్తావించారు. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను మేము నిశితంగా గమనిస్తున్నాము. నిన్న మా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడారు. అధ్యక్షుడు ట్రంప్‌ గత వారం ప్రధాని మోదీతో మాట్లాడుతూ తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ పక్షాన నిలుస్తామని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మా పూర్తి మద్దతు ఉంటుంది అని ఆమె అన్నారు.

Social Share Spread Message

Latest News