Namaste NRI

రూ.18కోట్ల డిమాండ్‌ చేసిన లేడి సూపర్‌స్టార్‌!

దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా నయనతార  పేరును సాధించింది. రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ హవా కొనసాగిస్తుంది. తాజాగా వార్తల్లో నిలిచింది. మెగాస్టార్‌ సినిమాలో జతకట్టనున్నది. ఈ ప్రతిష్టాత్మక మూవీకి రూ.18కోట్లు డిమాండ్‌ చేసినట్లు టాలీవుడ్‌ సర్కిల్‌లో వార్త తెగ చెక్కర్లు కొడుతున్నది.  మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఓ భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కనున్నది. ఈ మూవీలో హీరోయిన్‌గా నయన్‌ను తీసుకోవాలని మేకర్స్‌ నిర్ణయించారు. ఈ క్రమంలో లేడి సూపర్‌స్టార్‌ను సంప్రదించగా, మూవీకి రూ.18కోట్లు డిమాండ్‌ చేసినట్లు టాక్‌. ప్రస్తుతం నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

నయన్‌ డిమాండ్‌కు నిర్మాతలు తలొగ్గితే,  సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకున్న నటిగా నయన్‌ నిలువనున్నది. చిరంజీవి సరసన ఇప్పటికే నయన్‌ సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్‌లో మూడో చిత్రం వస్తుందా? లేదా? అనేది త్వరలోనే తేలనున్నది. 

Social Share Spread Message

Latest News