Skip to main content

Namaste NRI

యుఫోరియా చిత్రం అందరికీ నచ్చుతుంది.. ఫ్లై హై సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణ శేఖర్

నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ట్రెండీ మూవీ యుఫోరియా. నీలిమ గుణ నిర్మాత. భూమిక చావ్లా, సారా అర్జున్‌, నాజర్‌, రోహిత్‌, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్‌, కల్పలత, సాయి శ్రీనికారెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, రవిప్రకాశ్‌, నవీనారెడ్డి, లికిత్‌ నాయుడు ఇందులో ముఖ్య పాత్రధారులు. ప్రస్తుతం సినిమా నిర్మాణదశలో ఉంది. మేకర్స్‌ ఈ సినిమా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఈ సినిమాలోని ఫ్లై హై  అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ గీతాన్ని కాలభైరవ స్వరపరిచి, పృథ్వీచంద్ర, గాయత్రి నటరాజన్‌లతో కలిసి ఆలపించారు. యువత మత్తులో మునగడం, నైట్‌ అవుట్స్‌, ఫ్రెండ్స్‌తో పార్టీలు ఇలాంటి విపరీత పోకడలను ఈ పాటలో చూపించారు. యూత్‌కి ఇన్‌స్టంట్‌ కిక్‌ ఇచ్చేలా పాటను చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. ఆడియెన్స్‌ చూపించే ఎనర్జీయే యుఫోరియా.

ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. ఇందులో కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది. నేను చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నా అని దర్శకుడు గుణశేఖర్‌ చెప్పారు. ఇంకా చిత్రయూనిట్‌ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: నాగేంద్ర కాశి, కృష్ణహరి, కెమెరా: ప్రవీణ్‌ కె.పోతన్‌, సమర్పణ: రాగిణి గుణ, నిర్మాణం: గుణ హ్యాండ్‌మేడ్‌ ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events