Namaste NRI

 ఫ్రాన్స్‌ అధ్యక్షుడు సంచలన నిర్ణయం

పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్‌ మీడియా వాడకంపై ఫ్రాన్స్‌ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తాజాగా వెల్లడించారు. మిడిల్‌ స్కూల్‌లో 14 ఏండ్ల ఓ విద్యార్థి స్కూల్‌ సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడిన ఘటన ఫ్రాన్స్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మాక్రాన్‌ నుంచి పై ప్రకటన వెలువడటం గమనార్హం. యువతలో హింసాత్మక ప్రవృత్తి పెంచడానికి సోషల్‌ మీడియా ఆజ్యం పోస్తున్నదని, పర్యవేక్షణ లేకుండా పిల్లల సోషల్‌ మీడియా వాడకం హానికరమని ఆయన అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events