
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖారరైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం ఆయన్ను ఆదేశించింది. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర కసరత్తు చేశారు. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ , కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో రామచందర్‌రావు పేరును ఖరారు చేశారు. ఆరెస్సెస్‌తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరు బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
















