Skip to main content

Namaste NRI

బకాసుర టైటిల్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

హాస్యనటుడు ప్రవీణ్‌ ప్రధానపాత్రలో రూపొందుతున్న హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ బకాసుర రెస్టారెంట్‌. వైవా హర్ష టైటిల్‌రోల్‌ పోషించారు. కృష్ణభగవాన్‌, షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌ కీలక పాత్రధారులు. ఎస్‌.జె.శివ దర్శకుడు. లక్ష్మయ్య ఆచారి, జానార్దన ఆచారి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఈ పాటను లాంచ్‌ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతి, సంగీతం: వికాస్‌ బడిస, నిర్మాణం: ఎస్‌.జె.మూవీస్‌.

Social Share Spread Message

Latest News