Namaste NRI

బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి  టీజర్‌  విడుదల

దీక్షిత్‌శెట్టి హీరోగా నటిస్తున్న తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రం బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి. అభిషేక్‌ ఎమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హెచ్‌.కె.ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. క్రైమ్‌ కామెడీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. బ్యాంక్‌ దోపిడికి వెళ్లిని హీరో గ్యాంగ్‌కి అక్కడ కేవలం 67వేల రూపాయలు మాత్రమే దొరుకుతాయి.

ఆ తర్వాత వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే అంశాలతో టీజర్‌ వినోదప్రధానంగా సాగింది. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇదని, చక్కటి వినోదంతో సాగుతూ థ్రిల్‌ని పంచుతుందని మేకర్స్‌ తెలిపారు. బృందా ఆచార్య గోపాల్‌కృష్ణ దేశ్‌పాండే, సాధు కోకిల, శృతి హరిహరన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జుధాన్‌ శ్యాండీ, రచన-దర్శకత్వం: అభిషేక్‌ ఎమ్‌.

Social Share Spread Message

Latest News