Namaste NRI

ఈ సినిమా ద్వారా ఆ వాస్తవాన్ని తెలుసుకున్నా : అనుపమ

అనుపమ పరమేశ్వరన్‌  ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం పరదా.   ఈ సినిమా నుంచి యత్ర నార్యస్తు పూజ్యంతే అనే థీమ్‌సాంగ్‌ను విడుదల చేశారు.  అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ నాయికా ప్రధానంగా ఓ సినిమా వస్తుందంటే ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలతో పాటు ఒక్కోసారి ప్రేక్షకులు కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉండరు. అది ఎంత మంచి సినిమా అయినా సరే. దీనిని నేను తప్పనను. అది వాస్తవం. ఈ సినిమా ద్వారా ఆ వాస్తవాన్ని తెలుసుకున్నా అన్నారు.

గొప్ప కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కిందని, ఇందులో డ్యాన్స్‌, ఫైట్స్‌ ఏమి లేకపోయినా హృదయాన్ని కదిలించే ఉద్వేగాలుంటాయని, నేటి సమాజంలో స్త్రీసాధికారత, స్వాభిమాన అవశ్యకతకు అద్దం పడుతుందని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పింది. స్త్రీల తాలూకు సామాజిక సమస్యను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తీశానని దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల అన్నారు. ఈ  చిత్రం ఆగస్ట్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News