తేజసజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం మిరాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం. రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి కోసం మ్యూజికల్ అప్డేట్ అందించారు.ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వైబ్ ఉంది అప్డేట్ అందించారు. వైబ్ ఉంది అంటూ సాగే మెలోడీ ట్రాక్‌ను జులై 26న తెలుగుతోపాటు పలు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్లో తేజ సజ్జా, రితికా నాయక్ రొమాంటిక్ ఫోజులో ఉండటం చూడొచ్చు. మిరాయి అనుకున్న షెడ్యూల్ ప్రకారమే 2025 సెప్టెంబర్ 5న పలు భాషల్లో విడుదల కానున్నట్టు ప్రకటించి సినిమా వాయిదా పుకార్లకు చెక్ పెట్టారు మేకర్స్.

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా, గౌరా హరి సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందని ఇప్పటికే వార్తలు రాగా, దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
















