విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం భద్రకాళి. అరుణ్ప్రభు దర్శకత్వం. ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడారు. ఇది నా 25వ చిత్రం. పొలిటికల్ జానర్లో సరికొత్త ప్రయత్నం. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అన్నారు.

రగ్గ్డ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇదని, అవినీతిమయమైన వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఓ వ్యక్తి చేసే పోరాటమే ఇతివృత్తమని ఆయన తెలిపారు. సమకాలీన రాజకీయాలకు దగ్గరగా ఉండే చిత్రమిదని దర్శకుడు అరుణ్ప్రభు పేర్కొన్నారు. సామాజిక ప్రయోజనం ఉన్న అంశాలతో ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించేలా ఈ చిత్రాన్ని తీశామని నిర్మాత రామాంజనేయులు అన్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్ తదితరులు నటిస్తు న్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, దర్శకత్వం: అరుణ్ప్రభు.















