Namaste NRI

మలేసియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

మలేసియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆ దేశ రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో బోనాలను అక్కడి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు కుటుంబాల వారు ఈ పండుగలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాలకు హాజరైన వారందరూ సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సైదం తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాదాయలను చాటే విధంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలుగు కుటుంబాలతో పాటు, మలేసియా కుటుంబాల వారు సైతం పాల్గొన్నారని తెలిపారు.

Social Share Spread Message

Latest News