Namaste NRI

ప్రత్యేక గీతంతో చిరంజీవి  విశ్వంభర షూటింగ్‌ పూర్తి

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలు.   చిరంజీవి, బాలీవుడ్‌ నాయిక మౌనిరాయ్‌లపై తెరకెక్కించిన ప్రత్యేకగీతంతో షూటింగ్‌ కంప్లీట్‌ చేశామని మేకర్స్‌ తెలిపారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ స్పెషల్‌సాంగ్‌కు భీమ్స్‌ సిసిరోలియో స్వరాల్ని సమకూర్చగా కాసర్ల శ్యామ్‌ రచించారు. గణేష్‌ ఆచార్య నృత్యరీతుల్ని అందించిన ఈ పాటను వందమంది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా తెరకెక్కించామని, చిరంజీవి తన సిగ్నేచర్‌ స్టెప్స్‌తో అదరగొట్టారని చిత్రబృందం పేర్కొంది.

బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకం నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల దర్శకుడు వశిష్ట పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: వశిష్ట.

Social Share Spread Message

Latest News