నారా రోహిత్ నటిస్తున్న చిత్రం సుందరకాండ. ఈ హ్యూమరస్ ఎంటైర్టెనర్‌కు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. హీరో నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 27న సుందరకాండ విడుదల కానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ రెండు ప్రేమకథల్ని ప్రెజెంట్ చేస్తున్నది. తొలిప్రేమలోని అమాయకత్వాన్ని శ్రీదేవి విజయ్‌కుమార్‌తో కలిసి చూపించగా, వృతి వఘానీతో సెకండ్ లవ్‌ని ఆవిష్కరించింది. నరేశ్ విజయకృష్ణ, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ కోమంటం, రూపలక్ష్మి, సునైనా, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్ ఎం.వర్మ, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణం: సందీప్ పిక్చర్ ప్యాలెస్.
















