Namaste NRI

బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

లండన్‌లో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాక్షించారు. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చెయ్యాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యూకే నలుమూలల నుండి కేటీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News