Namaste NRI

కళారత్న కేవీ సత్యనారాయణకు ఆటా ఆధ్వర్యంలో సన్మానం

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో డల్లాస్‌లో కళారత్న కె.వి.సత్యనారాయణను సత్కరించారు. ఆటా సహాయ కార్యదర్శి శారద సింగిరెడ్డి సమన్వయపరిచిన  ఈ కార్యక్రమంలో ఆటా  ప్రెసిడెంట్‌ ఎలెక్ట్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ కేవీ సత్యనారాయణ జీవిత విశేషాలను వివరించారు. సతీష్ రెడ్డి, శారద సింగిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రఘువీర్ మరిపెద్ది, ఆటా కార్యవర్గ బృంద సభ్యులు కేవీ సత్యనారాయణను సన్మాన పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు సన్మాన గ్రహీత కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలు, గురువులతో అనుబంధం, సినీ జీవితం తదితర విషయాలపై సత్యనారాయణ ప్రసంగించారు.

ఆటా సభ్యులు గోలి బుచ్చిరెడ్డి, రామ్ అన్నాడి, శ్రీకాంత్ జొన్నల,శ్రీనివాస్ రెడ్డి కేలం, మాధవి మెంట, సుమన బీరం, నీరజ పడిగెల, సుమ ముప్పాల, హరిత కేలం, డా.యు.నరసింహారెడ్డి, చినసత్యం వీర్నపు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News