Namaste NRI

వార్-2 నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వార్‌-2.  ఈ నేపథ్యంలో మ్యూజిక్‌ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ సినిమాలోని తొలిగీతం ఆవన్‌ జావన్‌ గురించి పోస్ట్‌ చేశారు. ఈ గీతాన్ని హృతిక్‌రోషన్‌, కియారా అద్వాణీలపై చిత్రీకరించారు. త్వరలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ప్రీతమ్‌ స్వరపరచిన ఈ పాటను ఆర్జిత్‌సింగ్‌ ఆలపించారు.

అమితాబ్‌ భట్టాచార్య రచించారు. బ్రహ్మాస్త్ర చిత్రంలోని కేసరియా పాటను రూపొందించిన టీమ్‌ ఈ గీత రూపకల్పనలో పాలుపంచుకుందని, వార్‌-2 మ్యూజికల్‌గా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ పేర్కొన్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ తన స్పైయూనివర్స్‌లో భాగంగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News