Namaste NRI

లావ‌ణ్య త్రిపాఠి సతీ లీలావతి టీజర్ విడుదల

లావణ్య త్రిపాఠి, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి . తాతినేని సత్య దర్శకత్వం.  ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ  చిత్రం  టీజర్‌ను విడుదల చేశారు. భార్యభర్తల అనుబంధంతో పాటు వారి మధ్య తలెత్తే గొడవలతో టీజర్‌ హాస్యప్రధానంగా అలరించింది.

వినోదప్రధానంగా సాగే చిత్రమిదని, దంపతుల మధ్య చోటుచేసుకునే గిల్లికజ్జాలు, గొడవలను ఎంటర్‌టైనింగ్‌ వేలో ఆవిష్కరిస్తుందని మేకర్స్‌ తెలిపారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్నది. వీకే నరేష్‌, వీటీవీ గణేష్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాణ సంస్థ: దుర్గాదేవి పిక్చర్స్‌, దర్శకత్వం: తాతినేని సత్య.

Social Share Spread Message

Latest News