రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపంతో పసిఫిక్ తీరాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌తో పాటు అమెరికాలోనూ హెచ్చరికలు ఇచ్చారు. దీంతో హవాయి ద్వీపంలో అప్రమత్తత ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
















