Namaste NRI

ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌

కన్నడంలో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన సు ఫ్రం సో చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నేడు తెలుగులో విడుదల చేస్తున్నది. పనీల్‌ గౌతమ్‌, జేపీ తుమినాడ్‌, సంధ్య అరకెరె, ప్రకాష్‌ కె తుమినాడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ తుమినాడ్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా  ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.చిత్ర నిర్మాత రాజ్‌ బి శెట్టి మాట్లాడుతూ ఈ సినిమా కన్నడంలో అద్భుతాలు సృష్టించిందని, ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకుంటుందని, తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ఇది కన్నడలో బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ అయింది. తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాని నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకువెళ్తారనే నమ్మకం ఉంది. సినిమా తప్పకుండా ఆడియన్స్‌ని అద్భుతంగా ఎంటర్టైన్‌ చేస్తుంది అని నిర్మాత నవీన్‌ యెర్నేని చెప్పారు. ఒకప్పటి ఇవీవీ సత్యనారాయణగారి సినిమాల తరహాలో ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, ప్రతీ పాత్ర అదిరిపోతుందని, రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుల్ని పంచుతుందని మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుమేద్‌ కె, రచన-దర్శకత్వం: జేపీ తుమినాడ్‌.

Social Share Spread Message

Latest News